స్విగ్గీ డెలివరీ బాయ్ పై దాడి..! 1 d ago
TG: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో యువకులు హల్చల్ చేశారు. స్విగ్గీ డెలివరీ బాయ్ పై దాడి చేసి ఐదుగురు యువకులు బిర్యానీ, నగదు లాక్కెళ్లారు. అంతేకాదు..బ్రిడ్జ్ పై నుంచి స్విగ్గీ డెలివరీ బాయ్ బైక్ ను తోసేశారు. ప్రస్తుతం డెలివరీ బాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి ఘటనకు నిరసనగా స్విగ్గీ రైడర్లు నగరంలో సర్వీసులు నిలిపివేశారు. దాడికి పాల్పడిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.